అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: మీ-సేవ మొబైల్‌ యాప్‌ను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. మొబైల్‌లోనే మీ-సేవ సర్వీసులు పొందేలా యాప్‌ను రూపొందించారు. గ్యాప్‌ సర్టిఫికెట్‌, సిటిజన్‌ నేమ్‌ ఛేంజ్‌ వంటి తొమ్మిది రకాల సర్వీసులను కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు. అలాగే రైతులకు రుణమాఫీ, బోనస్‌ కోసం మొబైల్‌ అప్లికేషన్‌ ప్రారంభించినట్లు పేర్కొన్నారు.