అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఏపీ పునర్విభజన అంశాలపై చర్చించేందుకు నిర్వహించిన తెలుగు రాష్ట్రాల సీఎస్‌ల కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశం దాదాపు రెండు గంటల పాటు జరిగింది. విద్యుత్ బకాయిల అంశం, 9,10 షెడ్యూల్ సంస్థల ఆస్తులు, అప్పులు పంపకాల అంశం ఎటూ తేల్చలేదు. విభజన అంశాలపై చర్చించేందుకు మరోసారి భేటీ కావాలని ఇరు రాష్ట్రాల సీఎస్‌లు నిర్ణయించారు.