అక్షరటుడే, జుక్కల్‌: మద్నూర్‌ మార్కెట్‌ యార్డులో శనివారం జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం సోయా పంటకు రూ.4,892 మద్దతు ధర ప్రకటించిందని, రైతులు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఎకరాకు ఆరు క్వింటాళ్లు మాత్రమే ఉన్న కొనుగోలు నిబంధనను సడలించి, పండిన పంటను పూర్తిస్థాయిలో కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే రైతులకు భరోసా ఇచ్చారు. అలాగే పలువురు బాధితులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేశారు.