అక్షరటుడే, వెబ్‌డెస్క్: ‘డాకు మహారాజ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఈ ఈవెంట్ అనంతపూర్‌లో గురువారం జరగాల్సి ఉంది. తిరుపతిలో తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో దీనిని రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఏపీ మంత్రి, బాలకృష్ణ అల్లుడు నారా లోకేశ్ వస్తున్నట్లు ముందుగా ప్రకటించినప్పటికీ.. తాజాగా ప్రీరిజీల్ ఈవెంట్‌ను రద్దు చేశారు. డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిజీల్ కానుంది.