అక్షరటుడే, నిజాంసాగర్: మహమ్మద్ నగర్ మండల మున్నూరు కాపు కార్యవర్గాన్ని బుధవారం తునికిపల్లి గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా లింగాల శంకర్, గౌరవాధ్యక్షుడిగా లక్ష్మీనారాయణ, యూత్ అధ్యక్షుడిగా బోర్ర నరేష్ ఉపాధ్యక్షులుగా దఫెదార్ విజయ్, శీలం సాయిలు, ప్రధాన కార్యదర్శిగా కలకొండ నారాయణ, జాయింట్​ సెక్రెటరీలుగా సాయిలు, అశోక్, కోశాధికారిగా సిద్ధి రాములు తదితరులు పాల్గొన్నారు.