అక్షరటుడే ఇందూరు: స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజన ఉత్సవాలు శనివారం ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ నియమితులయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపిక చేయబడ్డ యువ బృందం సభ్యులు శైలి బెల్లాల్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడుతో సమావేశమయ్యారు. ఈ అవకాశం కల్పించిన యువజన మంత్రిత్వ శాఖకు శైలి బెల్లాల్ ధన్యవాదాలు తెలిపారు.