అక్షరటుడే, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని గాంధీభవన్ లో శనివారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సమావేశానికి జిల్లా నేతలు తరలివెళ్లారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జిల్లాల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సమావేశానికి నేతలు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, సురేశ్ షెట్కార్, పోచారం శ్రీనివాసరెడ్డి, మదన్ మోహన్ రావు, భూపతి రెడ్డి, అరికెల నర్సారెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, ఈరవత్రి అనిల్, మానాల మోహన్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, సునీల్ రెడ్డి, నగేశ్ రెడ్డి, ఆకుల లలిత, గడుగు గంగాధర్ తదితరులు హాజరయ్యారు