పెర్కిట్‌ సొసైటీ ఛైర్మన్‌పై వీగిన అవిశ్వాసం

0

అక్షరటుడే, ఆర్మూర్‌: పెర్కిట్‌ వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్‌ పెంట భోజారెడ్డిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. సొసైటీకి చెందిన డైరెక్టర్లు ఫిబ్రవరి 16న జిల్లా కో-ఆపరేటివ్‌ అధికారికి లేఖ రాశారు. ఈ మేరకు సోమవారం అవిశ్వాస తీర్మానంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అవిశ్వాసానికి తొమ్మిది డైరెక్టర్ల బలం కావాల్సి ఉండగా.. 8 మంది హాజరై మద్దతు పలికారు. దీంతో అవిశ్వాసం వీగిపోయినట్లు జిల్లా కో-ఆపరేటివ్‌ అధికారి ప్రకటించారు.