అక్షరటుడే, ఇందూరు: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నగరంలోని ధర్నాచౌక్ లో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మె తొమ్మిదో రోజుకు చేరుకుంది. ఆదివారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నాయకులు సంఘీభావం ప్రకటించారు. సమ్మెలో సంఘం అధ్యక్ష కార్యదర్శులు రాజు, భూపేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్, తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బధ్రీనాథ్, కార్యవర్గ సభ్యులు నర్సయ్య, కిషన్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.