అక్షరటుడే, కోటగిరి : మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన అయ్యప్ప, సాయిబాబా ఆలయ ప్రారంభోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో మేళతాళాల నడుమ ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. చిన్నారులు వివిధ దేవతల వేషధారణలో ఆకట్టుకున్నారు. స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణ వీధుల్లో మార్మోగింది.