అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: కోల్ కతా ఆర్.జి.కార్ మెడికల్ కాలేజ్ హత్యాచార బాధితురాలి తల్లిదండ్రులు పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ ను కలిశారు. తమ బాధలను వివరించి న్యాయం కోసం విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రికి తమ వాదనలు సమర్పించాలని అభ్యర్థించారు. ఇందుకు గవర్నర్ అంగీకరించారు. ఈ సందర్భంగా ఆయన వారిని ఓదార్చారు. మీరు ఒంటరిగా లేరని.. మానవత్వం మీ వెంట ఉందని అభయం ఇచ్చారు. న్యాయం గెలుస్తుందని చెప్పారు.