అక్షరటుడే, నిజాంసాగర్‌: సర్పంచ్‌ల ఫోరం మాజీ జిల్లా అధ్యక్షుడు రమేశ్‌ గౌడ్‌ను సోమవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందని నిరసిస్తూ మాజీ సర్పంచ్‌ల ఫోరం ఆధ్వర్యంలో సోమవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ముందస్తుగా మాజీ సర్పంచ్‌ను అదుపులోకి తీసుకున్నారు.