అక్షరటుడే, బోధన్‌: పట్టణంలోని ఏఎంసీ మార్కెట్‌లో లారీలను అడ్డుకున్న హమాలీలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మార్కెట్‌ గోదాం నుంచి బియ్యం తరలిస్తున్న లారీలకు అడ్డుగా నిలబడి వారు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. తమ సమస్యల పరిష్కారం కోసం కొన్నిరోజులుగా హమాలీలు సమ్మె చేస్తున్న విషయం విదితమే.