అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ శనివారం సాయంత్రం రాజమండ్రిలో నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా కుటుంబం మొత్తం హాజరు కానుంది. వారిని చూడడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వేడుక కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు.