అక్షరటుడే, వెబ్ డెస్క్: పసిడి ధర పరుగులు పెడుతోంది. గోల్డ్ రేట్ రేసు దసరాకు ముందు నుంచే ప్రారంభం కాగా, ఇప్పుడు ఆల్ టైం రికార్డు స్థాయికి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఏకంగా రూ. 80 వేలకు చేరింది. పది రోజుల కింద రూ.75 వేలకు పైగా పలికిన ధర, రోజు రోజుకు పెరుగుతూ ఇప్పుడు రూ.80 వేలకు చేరింది. దీంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.