అక్షరటుడే, వెబ్‌డెస్క్: పీఎస్‌ఎల్వీ సీ -59 రాకెట్ గురువారం నింగిలోకి దూసుకెళ్లనుంది. శ్రీహరికేటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో ఈ రాకెట్‌ను ప్రయోగించనుంది. బుధవారమే రాకెట్ ప్రయోగం జరగాల్సి ఉండగా ఇస్రో చివరి నిమిషంలో వాయిదా వేసింది. శాటిలైట్‌లో సాంకేతిక లోపాలను గుర్తించిన శాస్త్రవేత్తలు కౌంట్‌డౌన్ ప్రక్రియను నిలిపివేసి ప్రయోగాన్ని గురువారానికి వాయిదా వేశారు. ఈ రోజు సాయంత్రం 4:12 గంటలకు రాకెట్ ప్రయోగించనున్నారు. ఈ రాకెట్‌తో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా -3 ఉపగ్రహాన్ని కక్షలోకి పంపనున్నారు.