అక్షరటుడే, న్యూఢిల్లీ: ఢిల్లీ తొక్కిసలాట ఘటనపై రైల్వేశాఖ ప్రాథమిక నివేదిక రూపొందించింది. ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ రావడం కొంత ఆలస్యమైంది. ప్రయాణికులంతా 14వ ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణికులు వేచి ఉన్నారు. ఇంతలో ప్లాట్‌ఫామ్ 12పై ప్రత్యేక రైలును ప్రకటించారు. దీంతో ప్రయాణికులు ప్లాట్‌ఫామ్ మారేందుకు ప్రయత్నించారు. అలా ఒక్కసారిగా అందరూ కదలడంతో మెట్లపై తొక్కిసలాట జరిగింది. ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని రైల్వే శాఖ పేర్కొంది. తొక్కిసలాట ఘటనపై పూర్తి దర్యాప్తు కొనసాగుతోందని వివరించింది.