అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. మెదక్‌‌– నిజామాబాద్‌‌– కరీంనగర్‌‌– ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కరీంనగర్ కలెక్టరేట్లో నామినేషన్లు స్వీకరిస్తున్నారు. సోమవారం తొలిరోజు మొత్తం 9 నామినేషన్లు వచ్చాయి. ఇందులో పట్టభద్రుల స్థానానికి ఆరుగురు, టీచర్ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇందులో ఇద్దరు అభ్యర్థులు గ్రాడ్యుయేట్, టీచర్స్ రెండిట్లోనూ నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 12 సెట్ల నామినేషన్లు వచ్చాయి. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్​ కలెక్టర్ పమేలా సత్పతి నామినేషన్లు స్వీకరించారు.