అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: స్వీయ దర్శకత్వంలో కంగనా రనౌత్‌ నటించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 17న ఈ మూవీని చిత్ర యూనిట్ రిలీజ్ చేయనుంది. ఈ విషయాన్ని తెలుపుతూ కంగనా ఎక్స్‌ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టింది. ‘ఎమర్జెన్సీ’ మూవీని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా నిర్మించారు. ఈ మూవీ సెన్సార్‌ విషయంలో మధ్యప్రదేశ్‌ కోర్టు సూచనలకు నిర్మాణ సంస్థ అంగీకరించడంతో సినిమా విడుదలకు అడ్డంకి తొలగింది.