అక్షరటుడే, వెబ్ డెస్క్: రైతులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త తెలిపింది. రైతులు తీసుకునే వ్యవసాయ రుణాల పరిమితిని రూ.2 లక్షలకు పెంచింది. ఎలాంటి తనఖా లేకుండా రైతులు తీసుకునే వ్యవసాయ రుణాల పరిమితిని రూ.1.6 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు.