అక్షరటుడే, వెబ్‌డెస్క్ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. వ్యవసాయ అవసరాలకు, పంట సాగుకోసం ఎలాంటి తాకట్టులేకుండా అందించే రుణ సదుపాయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ రుణ పరిమితి రూ.1.6 లక్షలు ఉండగా, ప్రస్తుతం రూ. 2 లక్షలకు పెంచింది. ఈ నిబంధనలు 2025 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని ఆర్బీఐ ప్రకటించింది.