అక్షరటుడే, ఇందూరు: గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు శుక్రవారం తెలంగాణ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి అరుణ విడుదల చేశారు. ఫలితాలను gdcts.cgg.gov.in/nizamabad.ed వెబ్ సైట్​లో చూసుకోవచ్చని కళాశాల ప్రిన్సిపాల్​ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. మొదటి సెమిస్టర్ లో 46.44 శాతం, మూడో సెమిస్టర్ లో 55.14 శాతం, ఐదో సెమిస్టర్ లో 62.65 శాతం ఉత్తీర్ణులయ్యారని వెల్లడించారు. కార్యక్రమంలో కళాశాల పరీక్షల నియంత్రణ అధికారి భరత్ రాజ్, వినయ్ కుమార్, జయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.