అక్షరటుడే, వెబ్డెస్క్: మహా శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. మొత్తం మూడు వేల స్పెషల్ బస్సులు వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీశైలానికి 800 బస్సులు, వేములవాడకు 714, ఏడుపాయలకు 444, కీసరగుట్టకు 270, వేలాలాకు 171, కాళేశ్వరానికి 80, కొమురవెళ్లికి 51 బస్సులను అదనంగా నడపనున్నారు.