అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : సంక్రాంతికి వస్తున్నాం మూవీ టీం వినూత్నంగా ప్రచారం ప్రారంభించింది. ఈమూవీకి అనిల్‌రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా, హీరోగా విక్టరీ వెంకటేశ్‌, హీరోయిన్లుగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్యారాజేశ్‌ నటిస్తున్నారు. ఈమూవీ నుంచే ఇప్పటికి విడుదలైన రెండు పాటలు హిట్‌ అయ్యాయి. మూడో సాంగ్‌ను ఎవరితో పాడించాలని అనుకుంటున్న దర్శకుడిని..నేను పాడతా అని హీరో వెంకటేశ్‌ విజ్ఞప్తి చేయడం ఆకట్టుకుంటోంది.