అక్షరటుడే, వెబ్‌డెస్క్: హరిదా రచయితల సంఘం ఆరో మహాసభ సందర్భంగా నవ్య భారతి గ్లోబల్ స్కూల్ లో బుధవారం సరస్వతీరాజ్ హరిదా సాహిత్య పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేందర్ తెలిపారు. మంగళవారం ఉదయం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెయూ రిజిస్టర్ యాదగిరి ముఖ్యఅతిథిగా, తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాళేశ్వర శంకరం కీలకవక్తగా హాజరవుతున్నారని వివరించారు. సరస్వతీ రాజ్ హరిదా తెలంగాణ విశిష్ట సాహిత్య పురస్కారాన్ని ఏనుగు నరసింహ రెడ్డికి ప్రదానం చేస్తున్నట్లు వివరించారు. జిల్లాస్థాయి పురస్కారాలను మల్లవరపు చిన్నయ్య, డాక్టర్ లక్ష్మణ్, అన్యం పద్మజారెడ్డి, కామినేని రేణుక, మఠం సుజాతలకు ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో నరాల సుధాకర్, తిరుమల శ్రీనివాస్ ఆర్య, తొగర్ల సురేష్, నాగనాథ్ థామస్కర్, మధు, కొయ్యడ శంకర్ పాల్గొన్నారు.