అక్షరటుడే, వెబ్‌డెస్క్: మహిళల్లో చీర ప్రాముఖ్యత, ఫిట్నెస్ అవసరాన్ని మిళితం చేస్తూ హైదరాబాద్‌లో నిర్వహించిన ‘సారీ రన్’ ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. హైదరాబాద్‌కు చెందిన తనైరా సంస్థ, బెంగుళూరుకు చెందిన ఫిట్నెస్ కంపెనీ జేజే యాక్టివ్ సంయుక్తంగా ఈ సారీ రన్‌ను నిర్వహించారు. పీపీ నరసింహారావు మార్గ్‌లో జరిగిన ఈ రన్లో చీరలు ధరించిన 3,120 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. చంటిబిడ్డలతో కలిసి పరిగెత్తారు. ఆధునిక యుగంలో చీరకు ఉన్న ప్రాముఖ్యతను మరింతగా తెలియజేసేందుకు.. మహిళల్లో ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పించేందుకు ఈ రన్ నిర్వహించినట్లు ఆయా సంస్థల నిర్వాహకులు పేర్కొన్నారు.

