అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: మద్యం తాగి వాహనాలు నడిపిన కేసులో నలుగరికి జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఆరో టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. జహీర్ ఖాన్, ఇమ్రాన్ అలీ మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, కోర్టులో హాజరుపరచగా రెండు రోజుల చొప్పున జైలు శిక్ష వేశారు.
ఐదో టౌన్ పరిధిలో..
ఐదో టౌన్ ఠాణా పరిధిలో డ్రంకన్ డ్రైవ్ కేసులో దొరికిన ఇద్దరికి జైలు శిక్ష పడినట్లు ఎస్సై గంగాధర్ తెలిపారు. గంగాప్రసాద్, సంజయ్ దిగంబర్ మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడగా జడ్జి ఎదుట హాజరు పరిచామని తెలిపారు. వారికి న్యాయమూర్తి రెండు రోజుల చొప్పున జైలుశిక్ష వేశారని చెప్పారు.