అక్షరటుడే, వెబ్​డెస్క్​: భారత్​, ఇంగ్లాండ్​ మధ్య రెండో టీ20 శనివారం సాయంత్రం ఏడు గంటలకు చైన్నైలో ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్​ గెలిచి ఊపు మీదున్న భారత్​ రెండో టీ20లోనూ గెలవాలని పట్టుదలతో ఉంది. కాగా ఫస్ట్​ మ్యాచ్​లో సూపర్​ ఇన్నింగ్స్​​ ఆడిన అభిషేక్​ శర్మ గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఓపెనర్​ మ్యాచ్​ ఆడతాడా లేదా అనేది ఇంకా తెలియదు. మరోవైపు ఈ మ్యాచ్​తో విజయం సాధించి సిరీస్​ సమం చేయాలని ఇంగ్లిష్​ జట్టు చూస్తోంది.