అక్షరటుడే, ఆర్మూర్‌: పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో సోమవారం సాఫ్ట్‌బాల్‌ జిల్లా జట్ల ఎంపిక నిర్వహించారు. పురుషులు, మహిళల విభాగంలో ప్రాబబుల్స్‌ జట్లను జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు అసోసియేషన్‌ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గంగామోహన్, హెచ్‌ఎం లక్ష్మీ నర్సయ్య, బేస్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద్, సాఫ్ట్‌బాల్‌ కోచ్‌లు నరేష్, అనికేత్, సంజీవ్, మౌనిక పాల్గొన్నారు.