అక్షరటుడే, వెబ్‌డెస్క్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం కాళేశ్వరంలోని ముక్తేశ్వర ఆలయంలో అపచారం జరిగింది. గర్భగుడిలో ప్రైవేట్ ఆల్బమ్ కోసం షూటింగ్ నిర్వహించారు. దర్శనానికి వచ్చిన భక్తులను నిలిపివేసి.. గుడి తలుపులు మూసి గర్భగుడిలో చిత్రీకరణ చేపట్టడంపై విమర్శలు వెలువడుతున్నాయి. ఈ విమర్శలను దేవాదాయశాఖ అధికారులు పట్టించుకోవడంలేదు. ఆలయ పవిత్రతను దెబ్బతీశారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.