అక్షరటుడే, ఇందల్వాయి: ఇందల్వాయి మండల కేంద్రంలోని జ్ఞాన వాగ్దేవి పాఠశాల సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కరస్పాండెంట్ గంగాధర్, సీఐ నరేశ్, తహశీల్దార్​ సాయిలు, శ్రీధర్, సంతోష్ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.