అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఆగడం లేదు. ఆ వైరస్‌తో ఇప్పటికే లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. తాజాగా ఆ వైరస్ ఓ మనిషికి సోకింది. ఏలూరు జిల్లాలో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. బర్డ్ ఫ్లూ సోకిన వారికి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కాగా కోళ్ల ఫారాల్లో పనిచేసే వారికి, కోళ్లు పెంచే వారికి ఈ వైరస్ సోకే అవకాశం ఉంది.