అక్షరటుడే, వెబ్‌డెస్క్: దేశంలో జీబీఎస్(గాలియన్ బారే సిండ్రోమ్) వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఈ వైరస్‌తో తాజాగా మహారాష్ట్రలో మరో వృద్ధుడు మృతి చెందాడు. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో ఐదుగురిని జీబీఎస్ బలిగొంది. ప్రాణంతమైన ఈ వైరస్ తెలంగాణలో కూడా ఓ మహిళకు సోకిన విషయం తెలిసిందే. ఈ వైరస్ సోకితే పక్షవాతం, నరాల బలహీనత వచ్చే అవకాశం ఉంది.