అక్షరటుడే, హైదరాబాద్: GHMCలో స్టాండింగ్ కమిటీ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. పోటీకి పార్టీలు సై అంటున్నాయి. తమకూ ప్రాతినిధ్యం ఉండాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. సోమవారంతో పాలకమండలికి నాలుగేళ్లు పూర్తయ్యాయి. దీంతో సోమవారం నుంచి స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ షురూ అయింది. ఈ నెల 25న స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఉంటాయి. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి.