అక్షరటుడే, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలెట్టింది. గ్రామాల్లో వార్డుల వారీగా ఓటరు జాబితాను అప్డేట్ చేసి, ఫిబ్రవరి 3 వరకల్లా సప్లిమెంటరీ లిస్టు రెడీ చేయాలని అధికారులను ఆదేశించింది. ఓటర్ల తొలగింపు, చేర్పులపై ఫిబ్రవరి 4న స్థానిక రాజకీయ నాయకులతో భేటీ నిర్వహించాలని సూచించింది. ఫిబ్రవరి 6 నాటికి తుది జాబితాను ఖరారు చేయాలంది.
త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ !
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్సాహంగా ఉంది. ఇందుకు అనుగుణంగా ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించాలని యోచిస్తోంది. ప్రస్తుత పరిస్థితులను ఆధారంగా ఫిబ్రవరి రెండో వారంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.