అక్షరటుడే, వెబ్డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. జనవరి 11 నుంచి 16వ తేదీ వరకు 6 రోజుల పాటు సెలవులు ఇస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 17వ తేదీ శుక్రవారం కాలేజీలు పునః ప్రారంభం కానున్నాయి. పాఠశాలలకు ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చిన సంగతి తెలిసిందే.