అక్షరటుడే, వెబ్డెస్క్: ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(ఎన్ఐసీ)కు అప్పగించింది. ఇప్పటి దాకా ప్రైవేట్ ఏజెన్సీ ధరణి పోర్టల్ నిర్వహణను చూస్తోంది. ఆ బాధ్యతను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీకి అప్పగించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఎన్ఐసీతో మూడేళ్ల ఒప్పందం చేసుకుంది. పనితీరు బాగుంటే మరో రెండేళ్లు పొడిగిస్తామని పేర్కొంది.