అక్షరటుడే, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న రెగ్యులర్ ఆచార్యుల పదవీ విరమణ వయసు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న పదవీ విరమణ వయస్సు 60 నుంచి 65 ఏళ్లకు పెంచింది. ఈ వయసు పెంపు UGC వేతన స్కేల్‌ను పొందుతున్న అధ్యాపకులకు మాత్రమే వర్తించనుందని ఉత్తర్వులో పేర్కొంది. నైపుణ్యాన్ని కొనసాగించేలా విశ్వవిద్యాలయాలలో మరి కొంతకాలం సీనియర్ అధ్యాపకులను కొనసాగించనుంది. నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (NAAC) గ్రేడింగ్‌ను నిర్వహించే సౌకర్యాలు, బోధన, పరిశోధన నాణ్యతను కాపాడాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.