అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: హైదరాబాద్‌లో ఐటీ పార్క్ ఏర్పాటు చేసేందుకు సింగపూర్ గవెర్నమెంట్ తో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రూ.450 కోట్లతో హైదరాబాద్‌లో భారీ ఐటీ పార్క్ ఏర్పాటుకు ఎంవోయూ కుదిరింది. హైదరాబాద్‌ను వాణిజ్య రాజధానిగా చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటికే తెలంగాణలో రూ.3,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సింగపూర్ కు చెందిన ఎస్‌టీటీ గ్లోబల్ డేటా సెంటర్ తో ఎంవోయూ కుదిరిన విషయం తెలిసిందే.