అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ప్రేమ సంబంధాలలో (ప్రియుడు, ప్రియురాలు) పరస్పర అంగీకారంతో ఏర్పడిన శారీరక సంబంధాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ముంబైలోని ఖర్ఘర్ పోలీస్‌స్టేషన్‌లో మహేశ్ దాము ఖరేపై వనితా ఎస్ జాదవ్ దాఖలు చేసిన ఏడేళ్ల ఎఫ్‌ఐఆర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు పైవ్యాఖ్యలు చేసింది. ఈపిటిషన్‌ను జస్టిస్ బీవినాగరత్న, జస్టిస్ ఎన్ కోటిశ్వర్‌సింగ్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. ఇద్దరి అంగీకారంతో చాలా కాలం పాటు లైంగిక సంబంధం పెట్టుకొని.. వివాదాలు తలెత్తినప్పుడు దానిని అత్యాచారంగా పేర్కొనడం ఆందోళనకర ధోరణి అని వ్యాఖ్యనించింది. ఇలాంటి కేసులపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఏళ్ల తరబడి శారీరక సంబంధాలు కొనసాగించిన తర్వాత ఇలా కేసులు పెట్టుకోవడం సరైన పద్ధతి కాదని సూచనలు చేసింది.