అక్షరటుడే, వెబ్​డెస్క్​: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెస్​లో చేరిన గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, డాక్టర్ సంజయ్ కుమార్, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డిలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డి పిటిషన్​ వేశారు. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం ఏడుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. కడియం శ్రీహరి, దానం నాగేందర్​, తెల్లం వెంక్రటావుపై అనర్హత పిటిషన్​తో కలిపి దీనిని విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది.