అక్షరటుడే, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్‌ సమావేశం ముగిసింది. రెండున్నర గంటలకుపైగా ఈ కేబినెట్‌ సమావేశం సాగింది. కులగణన, ఎస్సీ వర్గీకరణ, డెడికేషన్‌ కమిటీ నివేదికలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్‌ నివేదికకు ఆమోదం తెలిపింది. అలాగే కులగణనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.