అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఇటీవల వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ కేసులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫుడ్‌పాయిజన్ కేసులకు సంబంధించి కారణాలు తేల్చేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఫుడ్ సేప్టీ కమిషనర్, అదనపు డైరెక్టర్, జిల్లా స్థాయి అధికారితో కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గురుకులాలు, హాస్టళ్లు, అంగన్ వాడీలు, ఆస్పత్రుల్లో ఆహార నాణ్యతను టాస్క్‌ఫోర్స్ పర్యవేక్షించనుంది. ఫుడ్‌పాయిజన్ జరిగినప్పుడు కారణాలు తేల్చి, బాధ్యులను గుర్తించనుంది.