అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : తెలంగాణ ప్రభుత్వం పుష్ప- 2 మూవీకి టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల బెనిఫిట్ షోతోపాటు, అర్ధరాత్రి 1 గంట షోకు కూడా అనుమతి ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ ఏదైనా సరే రూ.800గా టికెట్ ధర నిర్ణయించారు. ఇక అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అదనపు షోలకు కూడా అనుమతి ఇచ్చారు. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్ లలో రూ.150, మల్టీప్లెక్స్ లో రూ.200 పెంచారు. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.105, మల్టీప్లెక్స్ లో రూ.150 పెంపునకు, అలాగే డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.20, మల్టీప్లెక్స్ లో రూ.50 పెంపునకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పుష్ప- 2 మూవీ మొత్తం ఆరు భాషలలో 12 వేలకు పైగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా రన్ టైమ్ 3 గంటల 20 నిమిషాల 38 సెకన్లు ఉన్నట్లు సమాచారం.