అక్షరటుడే, హైదరాబాద్: ఎల్​ఆర్​ఎస్​పై తెలంగాణ ప్రభుత్వం నేడు మార్గదర్శకాలు జారీ చేయనుంది. ప్రభుత్వ భూమి, జలవనరుల సమీపంలోని ఉన్నవి మినహా.. మిగిలిన దరఖాస్తులకు ఆటోమేటిక్ ఫీ జనరేషన్ జరగనుంది. దరఖాస్తుదారులకు నేరుగా రుసుము సమాచారం అందనుంది. ఈ మేరకు రెండురోజుల్లో సాఫ్ట్‌వేర్‌ అందుబాటులోకి రానుంది. తదుపరి ఫీజు వసూళ్లపై సబ్ రిజిస్ట్రార్లకు సర్క్యులర్ జారీ చేస్తారు.