అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్నకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్​ నోటీసులు జారీ చేసింది. కులగణన విషయంలో ఇటీవల మల్లన్న చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై నాయకులు, కార్యకర్తల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు నోటీసులు ఇచ్చినట్లు క్రమశిక్షణ కమిటీ పేర్కొంది. ఈ నెల 12లోగా వివరణ ఇవ్వాలని, లేకపోతే కాంగ్రెస్​ అంతర్గత రాజ్యాంగం ప్రకారం కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది.