అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా వైభవంగా కొనసాగుతోంది. భక్తులు గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. జనవరి 24 నుంచి 26 వరకూ మహాకుంభమేళాలో డ్రోన్‌ షో నిర్వహించాలని ఉత్తర్‌ప్రదేశ్‌ టూరిజం డిపార్ట్‌మెంట్‌ నిర్ణయించింది. ఈనేపథ్యంలో నిర్వహించిన డ్రోన్‌షో భక్తులను మంత్రుముగ్ధులను చేసింది. ప్రదర్శన సమయంలో ఒకేసారి వేల డ్రోన్‌లు ఆకాశంలో మిరిమిట్లు గొలుపుతూ ఆకర్షణీంగా వివిధ ఆకారాల్లో భక్తులకు కనువిందు చేశాయి. ఈ ప్రదర్శన భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత వెల్లువిరిసేలా రూపొందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.