అక్షరటుడే, వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చీనాబ్ రైల్వే వంతెనపై తొలిసారి వందే భారత్ రైలు ప్రయాణించింది. శ్రీమాతా వైష్ణోదేవి రైల్వేస్టేషన్ నుంచి శ్రీనగర్ వరకు గల మార్గమధ్యలో చీనాబ్ నదిపై నిర్మించిన వంతెన ప్రధాన ఆర్చ్ గుండా రైలు పరుగులు పెట్టింది. ఈ దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.