అక్షరటుడే, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున రెండు గంటలకు అమ్మవారికి విశేష అభిషేకం, కుంకుమార్చన చేశారు. ఉదయం మూడు గంటల నుంచి అక్షర శ్రీకర కార్యక్రమాలను ప్రారంభించారు. నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించారు.