అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: బీబీపేట మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవీ కన్యకా పరమేశ్వరి విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం మండల కేంద్రంలో వైశ్యులు కలశాలతో ఊరేగింపు చేపట్టారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.